మాట్లాడుతున్న డాక్టర్ బిందుమీనన్ వెల్లడి
మెదడుకు సంబంధిత వ్యాధి 'పార్కిన్సన్స్'
-డాక్టర్ బిందుమీనన్ వెల్లడి
నెల్లూరు:పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించినదని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందుమీనన్ అన్నారు. మంగళవారం పార్కిన్సన్స్ (వణుకుడు) దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో వైద్యశాలలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువగా 60ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి కనిపిస్తుందని, పూర్తి స్థాయిలో నివారణలేదన్నారు. ప్రధానంగా ఈ వ్యాధి లక్షణాలు చేతలు వణకడం, నడక స్పీడు తగ్గడం, మాటతడబాటు వంటివని పేర్కొంటూ పార్కిన్సన్స్ వ్యాధి గురించి ఆసక్తిక అంశాలు వెల్లడించారు. ఈ వ్యాధి ఎటువంటి కారణాలు లేకుండానే ఈవ్యాధి వస్తుందని, ఈ పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జన్యుపరంగా ఇది కేవలం 5శాతం వరకు మాత్రమే సంక్రమిస్తుందని చెప్పారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి లేకపోవడం ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు గుర్తించిన తరువాత న్యూరాలజిస్ట్‌ను సంప్రదిస్తే వారు పరీక్షించి, ఇది పార్కిన్సన్స్ కాదా అని నిర్ధారిస్తారని,అదేవిధంగా మెదడుకు స్కాన్ తీసి ఇతర సబంధిత రుగ్మతలు ఏమైనా ఉన్నాయాఅని క్షుణంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. పార్కిన్సన్స్ ప్రాణాంతకం కాదని, దీనికి మంచి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ బిందుమీనన్ స్పష్టం చేశారు. ఈ వ్యాధిని త్వరగా గుర్తించగలిగితే చికిత్స విధానం సులవవుతుందని చెప్పారు. పార్కిన్సన్స్ వ్యాధిని నియంత్రణ చేయవచ్చని, అయితే పూర్తి నయం చేయడం సాధ్యం కాదన్నారు. డాక్టర్ సూచించిన మందులతోపాటూ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, యోగా, కౌన్సెలింగ్, కాగ్నిటివ్ రిహాబిలిటేషన్ డ్యాన్స్ థెరపీ వంటివి పార్కిన్సన్స్ వ్యాధి నియంత్రణకు ఉత్తమ చికిత్సలుగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కావున ఈ పార్కిన్సన్స్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమని, ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారు ఈ లక్షణాలు ఉంటే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిదని సూచించారు. సమాజంలో ఈ వ్యాధిపట్ల ఉన్న ప్రచారాలు అపోహలని స్పష్టం చేశారు.










