మద్యం వద్దని నిరసన
ప్రజాశక్తి-కావలి : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ టిడిని ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు సూచనలతో శుక్రవారం తెలుగు యువత, టిఎన్‌ఎస్‌ఎఫ్ ల ఆధ్వర్యంలో కావలి పట్టణ ట్రంక్ రోడ్డులోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మద్యం వద్దు - ఉద్యోగం ముద్దు సైకో పోవాలి - సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుయువత, టిఎన్‌ఎస్‌ఎఫ్ సభ్యులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్య విపరీతంగాపెరిగిపోయిందన్నారు. వైసిపి పాలనలో ఏపీలో పెరిగిన నిరుద్యోగంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. యువతే దేశానికి భవిష్యత్తు అయితే జగన్‌రెడ్డి వారికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. గతంలో 35 శాతంగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య ప్రస్తుతం ఈ వైసిపి ప్రభుత్వంలో 73 శాతానికి పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయన్నారు. ''సైకో పాలన'' వల్ల పెట్టుబడులు శూన్యమై, యువతకు శాపంగా మారిందన్నారు. వైసిపి పాలనలో మాదకద్రవ్యాలకు యువత బానిసలవుతున్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే అయస్కాంతంలా ఉండేదన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి పారిపోయేందుకు పరిశ్రమలు పోటీపడుతున్నాయన్నారు. పిల్లలకు మంచి విద్యను అందించి, మంచి భవిష్యత్తును ఇవ్వాలని తల్లిదండ్రులు తాపత్రయ పడుతుంటే, జగన్ రెడ్డి ప్రభుత్వంలో కష్టపడి డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొందన్నారు. అంతేకాకుండా తమ పిల్లలు డ్రగ్స్‌కు బానిస కాకూడదనే భయం గుప్పెట్లో తల్లిదండ్రులు బతుకుతున్నారన్నారు. ప్రతిరోజు కొన్ని లక్షల టన్నుల గంజాయి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటుతుంటే వాటిని తరలించే వారిపై మాత్రం కేవలం 1775 కేసులు మాత్రమే పెట్టారన్నారు. దీన్నిబట్టి చూస్తే వైసిపి నాయకులు గంజా, మాఫియాకు ఏ విధంగా సహక రిస్తున్నారనేది స్పష్టంగా అర్థంఅవుతుందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉద్యోగ, ఉపాధి కల్పన, పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అప్పుల రాష్ట్రంగా మార్చడమే కాకుండా రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోయే విధంగా చేశాడన్నారు. ఇదే విధంగా పరిపాలన కొనసాగితే రాబోయే రోజుల్లో యువత ఈ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని గద్దె దింపడం ఖాయమని, నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పూడిపర్తి మురళికృష్ణ, రాష్ట్ర టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల శివకుమార్, కావలి రూరల్ మండలం తెలుగు యువత అధ్యక్షులు తాత హరిబాబు, ప్రధాన కార్యదర్శి పులి రమేష్ యాదవ్, బి శివ, అంబటి కిషోర్, నాయుడు, పరిశుద్ధరావు, నాసిన ప్రసాద్, శ్రీకాంత్, వినోద్, కోవూరు వెంకటనారాయణ, ఇనగంటి అనిల్ కుమార్, పసుపులేటి పద్మ, దాసరి మహేంద్ర, కత్తి అజరు, ఉప్పాల శ్రీనివాసులు, బి.వేణు, మోడేగుంట శ్రీనివాసులు, మారుపూడి గోపి, చెరుకూరి కుమార్, తదితరులు పాల్గొన్నారు.










