May 10,2023 20:58

ఫొటో : మాట్లాడుతున్న రికార్డులు పరిశీలిస్తున్న నెల్లూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు

మద్యం దుకాణాల్లో తనిఖీలు
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని కల్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలలో నెల్లూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రికార్డులను, మద్యం బాటిళ్లను, కల్లు నమూనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం మర్రిపాడు, ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు తదితర ప్రాంతాలలో ఉన్న కల్లు దుకాణాలు, ప్రభుత్వ మద్యం దుకాణాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లు దుకాణాన్ని నడుచుకోవాలని నాణ్యత ప్రమాణాలు పాటించాలని కల్లు దుకాణ ఎఫ్‌టిఎఫ్‌లకు సూచనలు చేస్తున్నామన్నారు.
మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిపిన నగదును మరుసటి రోజు క్రమం తప్పకుండా సక్రమంగా బ్యాంకులో జమ చేయాలన్నారు. బ్యాంకులో జమ చేసిన నగదు రసీదులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన సమయం ప్రకారం షాపులను నిర్వహించాలన్నారు. అదేవిధంగా రికార్డులలో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుండాలన్నారు. ప్రతి బాటిల్‌ను స్కాన్‌ చేసే అమ్మాలన్నారు. మద్యం బాటిళ్లను ఎంఆర్‌పి కంటే ఎక్కువకు అమ్మరాదని, అట్లు అమ్మిన వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో నెలకు నాలుగుసార్లు దుకాణంలోని స్టాక్‌ను తప్పకుండా స్కాన్‌ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఆదేశాలను కాదని దుకాణంలో పనిచేసే సిబ్బంది వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట సిబ్బంది మాల కొండయ్య ఉన్నారు.