మద్యం దుకాణాల్లో తనిఖీలు
ప్రజాశక్తి-సీతారామపురం : జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపింటెండెంట్ ఆదేశాల మేరకు నెల్లూరు ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ ఎస్‌ఐ శ్రీనివాసులు శుక్రవారం రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను, మద్యం బాటిళ్లను, నగదును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిపిన నగదును మరుసటి రోజు క్రమం తప్పకుండా సక్రమంగా బ్యాంకులో జమ చేయాలన్నారు. బ్యాంకు నందు జమ చేసిన నగదు రసీదు లను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం షాపులను నిర్వహించాలన్నారు. అదేవిధంగా రికార్డులలో నందు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుండాలన్నారు. ప్రతి బాటిల్‌ను స్కాన్ చేసే అమ్మాలన్నారు. మద్యం బాటిళ్లను ఎంఆర్‌పి కంటే ఎక్కువ కు అమ్మరాదని, అట్లు అమ్మిన వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో నెలకు నాలుగుసార్లు దుకాణంలోని స్టాక్‌ను తప్పకుండా స్కాన్ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఆదేశాలను కాదని దుకాణంలో పని చేసే సిబ్బంది వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట సిబ్బంది, మాలకొండయ్య ఉన్నారు.










