Jan 30,2023 21:37

ఫొటో : మాట్లాడుతున్న ఐద్వా నాయకులు

మద్యాన్ని అరికట్టాలి : ఐద్వా
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలో బెల్ట్‌షాపులు ఎక్కువయ్యాయని, రోజువారీ కూలీలు సంపాదన మొత్తం మద్యంపై వెచ్చించి తాగుతున్నారని, మద్యపానం నివారణకు ప్రభుత్వం కృషి చేయాలని ఐద్వా నాయకులు పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు స్థానిక సిపిఎం కార్యాలయంలో ఐద్వా మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐద్వా మండల కార్యదర్శి శ్యామలమ్మ పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె మాట్లాడారు. అలాగే ఐద్వా మహిళా సభ్యత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఐద్వా మండలాధ్యక్షురాలు మూలి ప్రమీల మాట్లాడుతూ మండలంలో మద్యం బెల్టు షాపులు ఎక్కువయ్యాయని, దీనితో యజమానులు కూలి పనులు చేసి సంపాధించిన డబ్బులు మద్యానికే ఖర్చు పెడుతున్నారని గ్రామాలలో ఉండే బెల్టు షాపులను అరికట్టాలన్నారు. అలాగే మానవీ బుక్స్‌, మార్చిలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై చర్చించారు. సమావేశంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, మండల కార్యదర్శి రహంతుల్లా, నందవరం సీనియర్‌ నాయకులు మహమ్మద్‌ గౌస్‌, ఐద్వా గ్రామ నాయకురాలు ఖాసింబీ, రమణమ్మ, మున్నీ పాల్గొన్నారు.