రామసముద్రం :వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగుర వేస్తామని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. సోమవారం రామసముద్రం మండలంలో విస్తతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సమక్షంలో టిడిపి చేరినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివద్ధికి 2014 నుండి ఇప్పటివరకు వైసిపి ప్రభుత్వం చేసిన అభివద్ధికి తేడా చూస్తే కనీసం పది శాతం కూడా అభివద్ధి జరగలేదని దుయ్యబట్టారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. తాను టిడిపి చేరడంతో టిడిపి శ్రేణులు, ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టిడిపి బలోపేతం చేసి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జి.విజరు కుమార్ గౌడ్, ఎస్‌సి సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శివశంకర్, రాజంపేట పార్లమెంట్ కోశాధికారి సీతప్ప, మాజీ సర్పంచులు రమణ, శ్రీనివాసులు, చిన్నూ స్వామి, కష్ణమూర్తి, నారెపల్లి శ్రీనివాసులు, రాజేష్ స్వామి, దినేష్ పాల్గొన్నారు.










