సమీక్షిస్తున్న కలెక్టర్
ప్రజాశక్తి-నెల్లూరు : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఎం.హరి నారాయణన్ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్‌ను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వసతుల మెరుగుదలకు కావాల్సిన చర్యలపై వైద్యశాల సూపరింటెండెంట్ ,మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ,ఎపిఎంఐడిసి ఇంజనీర్లతో కలెక్టర్ గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో చర్చించారు. ప్రభుత్వం వైద్యశాలలో మరమ్మతులకు గురైన లిఫ్ట్లు ఎసిలకు సత్వరమే మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుకురావడం తో పాటు యాన్యువల్ మెయింటినెన్స్ కూడా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ వి సిద్దా నాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకష్ణ , ఏపీఎంఐడిసి ఇంజనీర్లు పాల్గొన్నారు.










