అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ, ఛైర్‌పర్సన్, తదితరులు
హిందూపురం : నాడు-నేడు పథకంతో పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ ఇక్బాల్ హామీ ఇచ్చారు. బుథవారం 31వ వార్డు గాంధీనగర్‌లోని ఇసి బార్సు ప్రాథమిక పాఠశాలలో రూ.16లక్షలతో చేపట్టిన పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్లు జబివుల్లా, బలరామిరెడ్డి, వార్డు కౌన్సిలర్ చిన్నమ్మ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేష్, వైసీపీ నాయకులు శ్రీరాములు, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.










