Apr 24,2023 21:17

- మంత్రి పెద్దిరెడ్డికి స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే చింతల

వాల్మీకిపురం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో మైనార్టీలకు సముచిత గౌరవం కల్పించినట్లు రాష్ట్ర భూగర్భ వనరులు, విద్యుత్‌, అటవీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం మదనపల్లె పర్యటనకు వెళ్తున్న ఆయనను వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి మైనారిటీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో మైనార్టీలకు ఉన్నతమైన ఉప ముఖ్యమంత్రి పదవి, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవితోపాటు, నలుగురిని ఎమ్మెల్యేలు, మరో నలుగురిని ఎమ్మెల్సీలు చేయడంతో పాటు 12 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారుల పదవులు, రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చిన ఘనత సిఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. క్షేత్రస్థాయిలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మైనార్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక శాతం మైనార్టీలు మాట్లాడే ఉర్దూను ద్వితీయ అధికార భాషగా అమలు చేస్తున్న ఘనత దేశంలో సిఎంకే దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు వైసిపికి అండగా ఉన్నారని తెలిపారు. వారి సామాజిక అభివద్ధి ధ్యేయంగా సిఎం ప్రత్యేక కషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎపిఎండిసి డైరెక్టర్‌ హరీష్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి చింతల శివానందరెడ్డి, వాల్మీకిపురం, కలికిరి మండలాల వైసిపి కన్వీనర్లు నీళ్ల భాస్కర్‌, చింతల రమేష్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ కేశవరెడ్డి, మైనారిటీ నాయకుడు అబ్దుల్‌ కలీమ్‌, నాయకులు వెంకటరెడ్డి, ముని భాస్కర్‌, రాయుడు, చికెన్‌ మస్తాన్‌, సైఫుల్లా, ఉమర్‌ సాహెబ్‌, నందమూరి బాబు, సాదిక్‌, సత్యా, శ్యామ్‌ పాల్గొన్నారు.