మైనార్టీల అభ్యున్నతికి అంకిత భావంతో కృషి- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రజాశక్తి-వాల్మీకిపురం
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పుంగనూరు పర్యటనలో భాగంగా వాల్మీకిపురం పట్టణానికి చెందిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్, పీలేరు సర్పంచ్ డాక్టర్ హబీబ్ బాషా, జిల్లా వక్ఫ్ కమిటీ అధ్యక్షుడు కరీముల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి హజ్ యాత్రికుల సమస్యల పరిష్కారానికి సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం పట్ల పుష్పగుచ్చం అందించి కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హజ్ యాత్రికులపై కేంద్రం మోపిన అదనపు భారాన్ని మినహాయించాలని కేంద్ర పెద్దలతో చర్చించేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ మిథున్ రెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం నేతత్వంలో ప్రత్యేక బందాన్ని పంపినట్లు తెలిపారు. ప్రత్యేక బందం ద్వారా చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో హజ్ యాత్రికులపై అదనంగా ఎలాంటి భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తుందని జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో అంగీకరించి వెసులుబాటు కల్పించారన్నారు. టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంభించారని, మంత్రివర్గంలో కనీసం ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేకుండా నాలుగున్నర ఏళ్ల పాట్లు పాలన సాగించారని, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు మైనార్టీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, మైనార్టీలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేరని పేర్కొన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి అంకిత భావంతో కషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జిలాని, సాహెబ్ , ఆబిద్, ఫయాజ్, మౌలానా, సాదిక్ పాల్గొన్నారు.
వక్ఫ్‌బోర్డు అభివృద్ధికి చర్యలు
ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్
జిల్లా వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని, బోర్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎస్.ఎ. కరిముల్లా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా, పుంగనూరుకు విచ్చేసిన మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అన్నమయ్య జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎస్.ఏ.కరిముల్లా ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, మసీదులు, ఈద్గాల అభివద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించినట్లు తెలిపారు. ఎస్.ఏ.కరీముల్లా మాట్లాడుతూ ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పర్యటించి వివిధ మసీదులు, దర్గాలను సందర్శించామని చెప్పారు. వక్ఫ్ బోర్డు ద్వారా వాటిని అభివద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అమ్ము, ఏపీ స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్ ఖాదర్ బాషా, కౌన్సిలర్ ఖాజా, వసీం పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందిస్తున్న అబ్దుల్ కలీమ్, హబీబ్‌బాషా










