ప్రజాశక్తి-విజయవాడ
స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం తెలుగు తల్లి విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం హిందీ భాషనురుద్దుటాన్ని వ్యతిరేకిస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. తెలుగుబాషాను కాపాడుకుందాం. ..కేంద్రం వైఖరిని ఖండించాలంటూ ప్లకార్డులు చేబూని నినాదాలుచేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిగా భిన్నంగా కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను రుద్దటం సరైనది కాదని అన్నారు. రాజ్యాంగంలో చెప్పిన 22 భాషలను సమానంగా చూడాలన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద అన్ని విధాలా పెత్తనం చేస్తూ చివరికి భాష మీద కూడా పెతనం చేయటం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని అన్ని భాషలకు సమాన హక్కులు కల్పించాలని, ఈ నిర్ణయం వల్ల యూనివర్సిటీ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.నాగేశ్వరరావు, కె.బాబు, రమణ, శివ కుమార్, నగేష్, సూర్య కిరణ్, శిరీష, డివైఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పి. కష్ణ పాల్గొన్నారు.










