కదిరి టౌన్ : 23వ జాతీయ స్థాయి స్క్త్య్ మార్షల్ పోటీల్లో కదిరి విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు మాస్టర్ షాకీర్ తెలిపారు. 23వ జాతీయ స్థాయి స్క్యూ మార్షల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు జమ్మూలోని భగవతినగర్ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం నందు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు 21 రాష్ట్రాల నుంచి సుమారు 3000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 10 మంది విద్యార్థులు లోబో, గ్రూప్ ఖవానికే క్యాటగిరిల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. కదిరి నుంచి 10 మంది విద్యార్థులు 15 విభాగాల్లో పోటీ పడ్డారు. అందులో 9 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రౌన్జ్ మెడల్స్ మొత్తం 13 మెడల్స్‌ను సాధించారు. అండర్ -11 బాలికల గ్రూప్ ఖవానికే విభాగంలో రీదా ముస్కాన్, రిషిత, మనోజ్ఞ సాయి గోల్డ్ మెడల్, అండర్ -11 బాలికల లోబో-21 కేజీల విభాగంలో రీదా ముస్కాన్ గోల్డ్, అండర్-11 బాలుర లోబో ఓపెన్ విభాగంలో మహమ్మద్ కైఫ్ బ్రౌన్జ్, అండర్ -14 బాలికల గ్రూప్ ఖవానికే విభాగంలో నీతిక, రోష్ని, నిహిత గోల్డ్, అండర్ -14 లోబో విభాగంలో నిహిత గోల్డ్, రోష్ని బ్రౌన్జ్, అండర్-14 లోబో-49 కేజీల విభాగంలో అలైహి వసల్లం గోల్డ్, అండర్-18 బాలుర లోబో-64 కేజీల విభాగంలో రంజిత్ బ్రాన్జ్, అబోవ్-18 లోబో 58 కేజీల విభాగంలో చాందిని సిల్వర్ పతకాలను సధించారు. ఈ విద్యార్థులను జిల్లా స్క్త్య్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాస్టర్ షాకీర్ అధ్యక్షులు షబ్బీర్, కోశాధికారి ఫజులున్నిసాలు అభినందనలు తెలియజేశారు.










