ప్రజాశక్తి బత్తలపల్లి : ఎక్కడైనా ఎప్పుడైనా మార్పు ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని.. ఆ అడుగు ఇప్పుడు లోకేష్ వేశారని ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. బత్తలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పరిటాల శ్రీరామ్ పర్యటించారు. మండలంలోని గరిశనపల్లి, దంపెట్ల, చెర్లోపల్లి, ఓబులాపురం, సంగాల పంచాయతీల్లో శ్రీరామ్ పర్యటించి స్థానికంగా ఉన్న నాయకులతో సమావేశమయ్యారు. ప్రధానంగా నారా లోకేష్ పాదయాత్రపై పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. లోకేష్ ప్రజల కోసం ఆయన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి యాత్ర చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు మరింత స్థైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెలలో జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు యాత్రకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గోనుగుంట్ల నారాయణరెడ్డి, సురేంద్ర నాయుడు, గోనుగుంట్ల అమర్నాథ్ చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి రవీంద్ర, పోతలయ్య, సుబ్బరాయుడు, జగ్గు, నాగభూషణ, రామ్మోహన్ రెడ్డి, నారాయణస్వామి, కేశవ, వెంకటరాముడు, శివయ్య, శేఖర్, దామోదర, చౌదరి, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, ఉమాపతి, సోమిరెడ్డి, సూరి, గనేవలి, ఉస్కేరప్ప తదితరులు పాల్గొన్నారు.










