న్యూఢిల్లీ : కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్థానంలో మరొకరిని అధిస్టానం నియమించనుంది. జులై 19 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీపై అసమ్మతి తెలియజేస్తూ ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లోని ఒకరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించరని వర్గాలు పేర్కొన్నాయి. శశిథరూర్, మనీష్ తివారీ, గౌరవ్ గొగోరు, రన్‌వీత్ సింగ్ బిట్టూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది.










