ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండల సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, టిడిపి నాయకులు మారంరెడ్డి గో పాలరెడ్డి అనారోగ్యంతో మతి చెందారు. అయన మృతిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం గోపాల్ రెడ్డి అంతిమ యాత్రలో సోమిరెడ్డి పాల్గొన్నారు. స్వయంగా పాడి మోసి అయన పై తనకున్న అ భిమానాన్ని చంద్రమోహన్ రెడ్డి చాట్టుకొన్నారు. ఈ సందర్భంగా మామ గోపాల్ రెడ్డితో తన కున్న అనుబంధాన్ని సోమిరెడ్డి గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.తన పన్నెండేళ్ల వయస్సులోనే తమ ఇంటికి గోపాల్ రెడ్డి అల్లుడిగా వచ్చారని సోమిరెడ్డి పేర్కొన్నారు.అప్పటి నుంచి తమ పట్ల ఎంతో ప్రేమ కనబరిచేవారని పేర్కొన్నారు. గోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపాల్ రెడ్డి అంతిమ యాత్రలో పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.










