ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ పట్టణంలోని మార్కెట్ వీధిలో వెలసిన భద్రావతి సమేత భావననా రుషీంద్రులస్వామి ఆలయంలో నూతన ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం హోమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విషచ్చేవారాధనం, పుణ్యాహవాచనం, రక్తాబంధన పూజ, పంచగవ్య ఆరాధనం, ఆచార్య వరణం వంటి పూజలు చేశారు. సాయంత్రం అగ్నిమధనం, అగ్నిప్రతిష్టాపనం, కుంభాసాదనం, కుంభస్థాపనం, ఉక్తహోమాలు నిర్వహించారు. ఉత్సవాలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు రూ.50వేలు విరాళం అందజేశారు. అలాగే ఆలయానికి బోడగల సావిత్రమ్మ, నారాయణప్ప జ్ఞాపకార్థ కుమారులు బోడగల శ్రీనివాసులు అండ్ సన్స్ 108-కిలోల పంచలోహ మార్కెండేయ, శివలింగ ఉత్సవ విగ్రహాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలియ బహుత్తమ సంఘం అధ్యక్షుడు జక్యా చిన్నసింగరయ్య, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి జింకా చిన్నప్ప, సహాయ కార్యదర్శి బోడగల శంకర, కోశాధికారి పారాళ పుల్లయ్య, సభ్యులు గోలి నాగభూషణం, గడ్డం రామకృష్ణ, జింకా మోహన్‌బాబు, కట్టా గోవిందు, పోలంకి పెద్ద రెడ్డప్ప, జింకరెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు.
మార్కెండేయ, శివలింగ 108 కిలోల పంచలోహ ఉత్సవ విగ్రహాలను బకరిస్తున్నదాతలు










