Mar 26,2022 15:07

ప్రజాశక్తి-కారంచేడు : ఈ నెల 28,29 జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. కనీస వేతనం రూ.26,000 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పాత కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని, ప్రైవేటీకరణ ఆపాలని ఆహారంతోపాటు ఆదాయపన్ను పరిధిలోని కుటుంబాలకు రూ.7500 ఆర్థిక మద్దతు ఇవ్వాలని, పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం విద్య ఆరోగ్య మరియు ఇతర ప్రజా అవసరాలకు ప్రభుత్వ కేటాయింపు పెరగాలని, అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం వెలుగు ఉపాధిహామీ నేషనల్ కమిషన్ సమగ్ర శిక్ష మరియు ఇతర స్కీం వర్కర్లకు కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం చట్టబద్ధం చేయాలని, పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, భవన నిర్మాణం ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తదితర రంగాల అసంఘటిత రంగ కార్మికులు అందరికీ సామాజిక భద్రత కల్పించాలనిడిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు వర్కర్లు టైం స్కేల్ తదితర రంగాలకు చెందిన వారందరినీ రెగ్యులర్ చేయాలని నూతన పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, డిఫెన్స్ సర్వీసులను అత్యవసర సర్వీసులు మార్చటానికి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర చేయాలని, ఉపాధి హామీ పథకానికి కేటాయింపు నుంచి 200 రోజులు పని కల్పించాలనిలో మరణించిన అన్ని ప్రభుత్వ శాఖల సంస్థల పథకాల్లో వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని 14 డిమాండ్లతో దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఈ సమ్మెలో ప్రజలు అందరూ పాల్గొని మద్దతు ఇచ్చి సమ్మెలో పాల్గొనాలని సిఐటియు కోరుతుంది. ఈ కార్యక్రమంలో కారంచేడు మండలం సిఐటియు సభ్యులు మరియు అధ్యక్ష కార్యదర్శులు అనిత, బి శంకర్, పర్చూరు డివిజన్ సిఐటియు కార్యదర్శి ప్రతాప్, సిపిఎం నాయకులు పి కొండయ్య తదితరులు పాల్గొన్నారు