Sep 25,2023 21:59

ఫొటో : మాట్లాడుతున్న షేక్‌.ఖాదర్‌ బీ

మానవ అక్రమ రవాణాపై సదస్సు
ప్రజాశక్తి-కావలి : మూమెంట్‌ ఇండియా సూచనల మేరకు సోమవారం ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్‌ ఖాదర్‌ బీ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల కావలిలో ''మానవ అక్రమ రవాణా'' పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో వక్తలు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. యువత మొదటి ప్రయారిటీ, నైతిక విలువల గురించి, బాల్యవివాహాలు, విద్య ప్రాముఖ్యతను, గురించి తల్లితండ్రుల, ముఖ్యపాత్ర, ఈ సమాజంలో ఆడపిల్లలు చదువుతోపాటు వాళ్లను వాళ్లు రక్షించుకునే విధంగా అవగాహన కలిగి ఉండాలన్నారు.
రవాణా, ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో, ఉద్యోగం పేరుతో, రకరకాలుగా, ప్రజలను ప్రలోభపెట్టి, మానవ అక్రమ రవాణా చేయించడం, వారి నుండి అవయవాలను తీసుకోవడం, వారిని వ్యభిచార గృహాలకు అమ్మి సొమ్ము చేసుకోవడం జరుగుతుందన్నారు. ఆలా యువతి యువకులకు, అవగాహన కల్పించారు. యువత మార్గ దర్శకాలను చూసుకొని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తదుపరి మానవ అక్రమ రవాణాకు సంబంధించిన, ప్లే కార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ కరెస్పాండంట్‌ ఎస్‌.వెంకయ్య, మట్టా కొండయ్య, స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్‌ ఖాదర్‌ బాషా, వి.ఎం.ఎన్‌.ఆర్‌ మాల్యాద్రి, రాయపాటి దిలీప్‌ కుమార్‌, జమీర్‌, రఫీ అహమ్మద్‌, ప్రసాదరావు, అజిత్‌ బాబు, మహమ్మద్‌ అలీంబేగ్‌, బ్రహ్మయ్య, హరినాధ్‌, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.