Jan 04,2023 21:53

ఫొటో : క్రీడాకారులను పరిచయం చేస్తున్న కమిషనర్‌ రమేష్‌బాబు

మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రమేష్‌బాబు పేర్కొన్నారు. బుధవారం విక్రమ సింహపురి కళాశాలల జోనల్‌స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిడి సిరిమామిళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన కమిషనర్‌ ముప్పాళ్ల రమేష్‌బాబు, కరస్పాండెంట్‌ సనిశెట్టి రాధాకృష్ణయ్య, ప్రిన్సిపాల్‌ గొల్ల వరకుమారి, యూనివర్సిటీ అబ్జర్వర్‌ డాక్టర్‌ అమరి ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఎదుగుదలకు, చురుకుదనానికి చాలా ఉపయోగపడుతాయని తెలిపారు.
పోటీల్లో ఆత్మకూరు ఎస్‌వి డిగ్రీ కళాశాలపై బుచ్చి సెయింట్‌ మేరీస్‌ కళాశాల, సీతారామ డిగ్రీ కళాశాల, సీతారామపురం ఎఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆత్మకూరు శ్రీ షిరిడీ సాయిరాం కళాశాల, కలిగిరిపై డాక్టర్‌ ఎస్‌ఆర్‌జెడి కళాశాల విజయం సాధించాయని తెలిపారు. గురువారం మిగిలిన పోటీలు జరుగుతాయని, 6వ తేదీ ఉదయం 9.30కి ఫైనల్స్‌ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో లైబ్రేరియన్‌ టి.శ్రీనివాసులు రెడ్డి, అధ్యాపకులు క్రీడాకారులు పాల్గన్నారు.