Apr 30,2023 21:33

ఫొటో : మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

మాదకద్రవ్యాలపై అవగాహన
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని రాయపేట గ్రామంలో మాదక ద్రవ్యాల నిషేధంపై ఆదివారం కోవూరు సబ్‌ సిఐ నరహరావు గ్రామస్తులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, నాటుసారా అమ్మకాలు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయిని విక్రయిస్తూ ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.