Dec 20,2022 22:42

ప్రశ్నాపత్రాల విడుదల

పెనుకొండ : ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ముద్రించిన 10 వ తరగతి మోడల్‌ టెస్ట్‌ పేపర్లను స్థానిక సిఐ కార్యాలయంలో సిఐ కరుణాకర్‌, రిటైర్డ్‌ ఎస్‌ఐ అల్లాబకాష్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ పెనుకొండ, రొద్దం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 100 పుస్తకాలను ఉచితంగా పంపిణి చేయడానికి చేయూతనందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి సుధాకర్‌, జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి, పెనుకొండ మండల ప్రధాన కార్యదర్శి నరేష్‌, మండల అధ్యక్షులు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.