Oct 29,2023 23:47

మా సర్వీస్‌ రూల్స్‌ను రూపొందించండి ..

మా సర్వీస్‌ రూల్స్‌ను రూపొందించండి ..
ఎంఎల్‌సిలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఉద్యోగుల సంఘం వినతి
ప్రజాశక్తి - క్యాంపస్‌ : ప్రభుత్వంలో విలీనమై రెండు సంవత్సరాలా రెండు నెలలు గడిచినా ఇంతవరకు తమ సర్వీస్‌ నిబంధనలు రూపొందించలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఉద్యోగుల సంఘం తరపున ఎంఎల్‌సిలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, కల్పలతారెడ్డిలను కలసి వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ నాదెండ్ల శ్రీమన్నారాయణ, డాక్టర్‌ జలగం రామాంజులు బందం, తిరుపతి, ఎస్వీ యూనివర్సిటీ, సెనేట్‌ హాల్‌ లో ఒక కార్యక్రమానికి వచ్చిన, వారితో మాట్లాడుతూ సర్వీస్‌ నిబంధనలు సకాలంలో రూపొందించుకపోవడం వల్ల,ప్రమోషన్స్‌ లో తమకు నష్టం జరుగుతోందని వాపోయారు. ఇరవైనుండి ముప్పై ఏళ్ల అనుభవం ఉన్నా ఎంతో నష్టపోతున్నామని వారి దష్టి కి తీసుకెళ్లారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఉద్యోగుల సమస్యలపై తమకు అవగాహన ఉందని, ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంఎల్‌సిలను కలిసిన వారిలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సురేంద్ర, మహిళా కార్యదర్శి సావిత్రీబాయి, కోశాధికారి శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ సుప్రజా రాణి, సంజీవరావు, భరణి కుమార్‌, సోమనాథ్‌, ప్రతాప్‌ గాంధీలు ఉన్నారు.
-