Jan 11,2023 19:49

గెలుపొందిన వారికి నగదు అందజేస్తున్న జడ్జి శారద

ప్రజాశక్తి-రాయచోటి : లయన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయమని ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ డాక్టర్‌ కె.శారద అన్నారు. బుధవారం రాయచోటి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఎన్‌ కాలనీలోని శ్రీ సాయి బాబా మందిరం ఆవరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూర్వకాలం నుంచి వస్తున్న సంక్రాంతి సంప్రదాయలను ప్రజలలో చైతన్యాన్ని పెంపొందించేలా లయన్స్‌ క్లబ్‌ వారు ముందుకు తీసుకెళ్తూ తెలుగు జాతి ఐక్యతను తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దాతలు బి.నాగిరెడ్డి, వి.సుబ్బారెడ్డి, బి.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాయచోటి లయన్స్‌ క్లబ్‌ తరుపున నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులుగా ఇవ్వడం చాల సంతోషంగా ఉంది రాబోయే రోజులలో మరిన్ని సేవా కార్యక్రమలు చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కె.బయరెడ్డి, డాక్టర్‌ సంగమ్మ, శోభ రెడ్డి, రామాదేవి, వ్యవస్థాపక అధ్యక్షులు హరినాధరెడ్డి, ఉపాధ్యక్షులు హరీష్‌ చంద్ర, కోశాధికారి రత్నమాచారి, ఆనంద్‌. నందిని ట్రావెల్స్‌ వినోద్‌ కుమార్‌ నాయక్‌, లోకేష్‌ స్వామి, సుభాష్‌ చంద్ర బోస్‌ పాల్గొన్నారు.