Mar 31,2023 22:51

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, తదితరులు

ప్రజాశక్తి -పెనుకొండ : నారా లోకేష్‌ చేపట్టింది యువగళం పాదయాత్ర కాదని , సెల్ఫీ యాత్ర అని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ ఎద్దేవా చేశారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా లోకేష్‌ పాదయాత్ర జరుగుతోందన్నారు. లోకేష్‌ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి పై మాట్లాడితే రాయలసీమ దాటే లోపల ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసపిఇ పారిశ్రామిక అభివృద్ధికి ఎప్పుడూ అవరోధం కాదని,రిజర్వాయర్‌ వద్ద ఉన్న భూములను మాత్రమే వెనక్కి ఇప్పిస్తామని చెప్పారని అన్నారు. పెనుకొండ అభివద్ధిపై శ్వేత పత్రం విడుదల చేస్తామని చర్చకు ఎప్పుడైనా రావాలని టిడిపి నాయకులకు సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీరాములు, రొద్దం ఎంపీపీ చంద్రశేఖర్‌, నాయకులు జయశంకర్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ నాగలూరు బాబు, కొండలరాయుడు, వెంకటరామిరెడ్డి,వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.