Jan 24,2023 21:55

ఫొటో : మాట్లాడుతున్న పోలంరెడ్డి దినేష్‌రెడ్డి

లోకేష్‌ పాదయాత్రతో వైసిపికి అంతిమయాత్ర
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగలం పాదయాత్రతో వైసిపి ప్రభుత్వానికి అంతిమయాత్ర తప్పదని కోవూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి అన్నారు. మంగళవారం లేబూరు గ్రామంలో ఇదేమీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మేళ తాళాల ఊరేగింపుతో ఘనంగా ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వానికి త్వరలోనే అంతిమయాత్ర తప్పదన తప్పదని, ప్రస్తుత శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్ని కుట్రలు పన్నిన నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, చెంచు కిషోర్‌ యాదవ్‌, చేముకుల కృష్ణచైతన్య, కొండూరు సుధాకర్‌ రెడ్డి, దొడ్ల నరేందర్‌ రెడ్డి, ఎంపిటిసి మధుసూదన్‌ రెడ్డి, ఉదయగిరి పెంచలయ్య, గంపల అనిల్‌కుమార్‌, ఈదురు చెన్నయ్య, మునగాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.