వాల్మీకిపురం : ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు దగాకోరు రాజకీయాలను, కొడుకు నారా లోకేష్ పాదయాత్రను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిఎ.మహల్‌లో గృహసారథులు, కన్వీనర్లకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు తమ వాలంటీర్లతో కలసి ప్రతి గడప దగ్గరకు వెళ్లి ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవాలన్నారు. ఎపిఎండిసి డైరెక్టర్ హరీష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సహదేవరెడ్డి, జడ్‌పిటిసి నిర్మల, సర్పంచ్ గంగులమ్మ, ఎఎంసి చైర్మన్ రవినాయక్, వైస్ ఎంపిపిలు వెంకట్రమణ, కిరణ్ కుమార్, నాయకులు నీళ్లభాస్కర్, కేశవ రెడ్డి, అబ్దుల్ కలీమ్, నరసింహులు, ఆనంద, రాయుడు, రవి, సైఫుల్లా, రాజేష్, లక్ష్మినారాయణ రెడ్డి, నల్లంకి నరసింహులు పాల్గొన్నారు.










