Mar 23,2023 22:44

నారా లోకేష్‌తో పల్లె కుటుంబసభ్యులు

ఓబుల దేవర చెరువు :తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఓబుల దేవల చెరువు మండలంలోని విడిది కేంద్రంలో నారా లోకేష్‌ను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తో పాటు ఆయన కుమారుడు క్రిష్ణకిషోర్‌రెడ్డి, కోడలు సింధూర కలిసి శాలువాతో సన్మానించారు. సత్య సాయి బాబా చిత్రపటాన్ని అందజేశారు.