Mar 24,2023 22:07

బహిరంగసభాస్థలి వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న పల్లె రఘునాథరెడ్డి

ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : ఓబుళదేవరచెరువు మండలంలో నారా లోకేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగసభను జయప్రదం చేయాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. లోకేష్‌ లోకేష్‌ పాదయాత్ర సాగే ప్రాంతాల్లో చేపట్టే ఏర్పాట్లను పల్లె శుక్రవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై తగు సూచనలు, సలహాలు అందించారు. ఓడి చెరువు మండలం వేమారెడ్డి పల్లి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను, పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించారు. బహిరంగ సభ హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, భోజన ఏర్పాట్లపై స్థానిక టిడిపి నాయకులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో టడిపి మండల కన్వీనర్‌ జయచంద్ర, మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుల్‌ రెడ్డి, టీడీపీ నాయకులు బోయపల్లి శివారెడ్డి, నిజాం, మల్లా పల్లి ఓబుల్‌ రెడ్డి, డాక్టర్‌ పొగాకు జాకీర్‌, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, వెంకట రంగారెడ్డి, కంచి సురేష్‌, గంటా శ్రీనివాసులు, చికెన్‌ షాను, మహిళ నాయకులు వైదేహి, మస్తానమ్మ, భాగ్యమ్మ, ఆషాభి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : నారా లోకేష్‌ యువ గళం పాదయాత్ర లో భాగంగా మండలంలోని గుట్టూరు గ్రామంలో ఏర్పాట్లను టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ సుబ్బరాయుడు, డికె. నాగప్ప, మండల ఉపాధ్యక్షులు నాగరాజు, మండల బిసి సెల్‌ అధ్యక్షులు ఆదిశేషు, సిద్దప్ప, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల : మండలంలో ఈనెల 26న నారాలోకేష్‌ పర్యటన సందర్భంగా పాదయాత్ర ఏర్పాట్లను టిడిపి మండల నాయకులు పరిశీలించారు. లోకేష్‌ పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహించే స్థలంలో జెసిబితో చదును చేయించారు. ఈ కార్యక్రమంలో టిడిపి హిందూపురం పార్లమెంటు కార్యదర్శి నరసింహులు, మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, మండల నాయకులు వెంకటరెడ్డి, ఫిరోజ్‌బాషా, మనోహర్‌, భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు