లలిత స్మైల్ క్లినిక్ అడ్వాన్స్ డెంటల్ కేర్ ఇంప్లాంటేషన్ సెంటర్ ప్రారంభం
విజయవాడ : విజయవాడ చెరుకుపల్లి వారి వీధి, గవర్నర్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత స్మైల్ క్లినిక్ అడ్వాన్స్ డెంటల్ కేర్ ను ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ దుర్గా క్షీతిష్ కొత్తూరు,డా.వర్ణణ కొత్తూరు ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా డెంటల్ రంగంలో విస్తత సేవలు అందిస్తున్న డాక్టర్ దుర్గాక్షితీష్ కొత్తూరు గారు మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలను అందించే దడ సంకల్పంతో ఈ క్లినిక్ (విస్తరించడంలో భాగంగా)నూతన ప్రాంగణంలో ప్రారంభించామన్నారు. ఈ క్లినిక్ లో ఇంట్రా ఓరల్ కెమెరాలు వ్యాధి నిర్ధారణ కోసం డిజిటల్ ఎక్స్‌రే మిషన్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా ఆధునాతన పరికరాలు అందుబాటులో తెచ్చామన్నారు. డెంటిస్ట్రీ, ఇంట్రా ఓరల్ స్కానర్, కెమెరా, సెంట్రలైజ్డ్ సక్షన్, 100శాతం డిజిటల్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. డాక్టర్ వర్ణన కొత్తూరు మాట్లాడుతూ నూతన ప్రాంగణంలో క్లినిక్ సేవలు ప్రారంభిం చడం చాలా సంతోషంగా ఉందన్నారు. సువిశాలమైన పార్కింగ్ సౌకర్యం, ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ అందుబాటులో ఉండేలా మల్టీస్పెషాలిటీ సేవలతో ఈ క్లినిక్ ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు డా.భవ్య లక్ష్మీ, డాక్టర్ మానస, డా.హరిప్రియ, డా.పావని, డా.మనీషా, డా. సుధాకర్, డా.రవికాంత్, డా.క్రిష్ణ చైతన్య, డా.శ్వేత పాల్గొన్నారు.










