ప్రజాశక్తి -కందుకూరు కందుకూరు నియోజకవర్గంలో మెగా సర్వే దావఆ లక్ష కుటుంబాలను కలిసినట్లు ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి చెప్పారు. స్థానిక వైసిపి కార్యాలయంలో సోమవారం మహీధర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కందుకూరు నియోజకవర్గంలోని 75శాతం కుటుంబాలను గహసారధలు, సచివాలయ కన్వీనర్లు కలిసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజా అభిప్రాయం సేకరించారన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల మందితో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మెగా సర్వే చేపించడం సాహసోపేత నిర్ణయమన్నారు. ఈ నెల 29 నాటికి సర్వే కందుకూరులో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి పద్ధతులు క్షీణించాయని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. సెల్ఫీలు ఎన్ని తీసుకున్న సంపూర్ణ సమాచారం తీసుకుని మాట్లాడితే హుందాతనంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన రాళ్ల దాడి మంచి పద్ధతి కాదని చెప్పారు. ఎవరికైనా శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఉంటుందన్నారు. దాడులు చేయడం సరికాదన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అని మాట్లాడితే ఇతరుల మనోభావాలు దెబ్బ తినవా అని ఆయన ప్రశ్నించారు.విలేకర్ల సమావేశంలో మండల జేసీఎస్ కన్వీనర్లు పాల్గొన్నారు.










