ఫొటో : మాట్లాడుతున్న డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు
లీజుకు ఆర్‌టిసి స్థలాలు
ప్రజాశక్తి-కావలి : కావలి ఎపిఎస్ ఆర్‌టిసి డిపో పరిధిలోని ఉలవపాడు బస్టాండ్ ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని 15 సంవత్సరాల కాలవ్యవధితో వ్యాపార నిమిత్తం అద్దె ప్రాతిపదికన కేటాయించడానికి టెండర్లను పిలుస్తున్నట్లు డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 2వ తేదీ లోపు టెండర్ ఫారాలను కొనుగోలు చేయాలని, 3వ తేదీ నెల్లూరులోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయంలో టెండర్ దాఖలు చేయాలనీ వివరించారు. సదరు స్థలంలో ఏ వ్యాపారం అయినా చేయవచ్చని, సబ్‌లీజ్‌కు కూడా ఇచ్చుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు, టెండరు ఫారాలకు సమీప డిపోలో సంప్రదించాలని కోరారు.










