Oct 24,2023 22:30

లారీని ఢకొీన్న బస్సు - ఒకరు మతి, పది మందికి గాయాలు

లారీని ఢకొీన్న బస్సు
- ఒకరు మతి, పది మందికి గాయాలు
ప్రజాశక్తి-పాకాల: బస్సు లారీని ఢకొీనడంతో లారీ డ్రైవర్‌ మతి చెందగా, బస్సు డ్రైవర్‌తో పాటూ పదిమంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. బస్సు నెల్లూరు నుండి తిరుపతి మీదుగా చిత్తూరు వెళుతోంది. లారీ తిరుపతి నుండి మదురై కి వెళుతుండగా నేషనల్‌ హైవే మార్గమధ్యంలో ఇరుగు రంగయ్యగారిపల్లి సమీపంలో సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో బస్సు లారీని ఢకొీంది. లారీ డ్రైవర్‌ ఎస్‌.సెంథిల్‌ కుమార్‌(37) తీవ్రంగా గాయపడ్డాడు. నెల్లూరు జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్‌ వి డేవిడ్‌తో పాటూ పదిమంది ప్రయాణి కులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ సెంథిల్‌ కుమార్‌ పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతి చెందాడు. పాకాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.