ప్రజాశక్తి-పీలేరు : సిమెంటు లోడు లారీని వెనుక నుంచి ప్రయివేటు అంబులెన్స్ ఓవర్టేక్ చేయబోయి ఆదే లారీని ఢకొీంది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు పీలేరు-కడప జాతీయ రహదారిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటికి చెందిన ఓ మహిళ గుండెపోటుతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రయివేటు ఆంబులెన్స్‌లో తిరుపతికి తరలిస్తుండగా, అదే సమయంలో బనగానపల్లి నుంచి తమిళనాడుకు సిమెంటు లోడుతో వెళుతున్న లారీ వెనుక చక్రం పీలేరు పట్టణ శివారులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బరస్ట్ అవడంతో, అంబులెన్స్ లారీని ఢకొీందని తెలిసింది. ఈ ఘటనలో రాయచోటికి చెందిన మహబూబ్ జాన్, రహత్ జాన్, ముబీనా, అంబులెన్స్ డ్రైవర్ సమీవుల్లా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనలో అంబులెన్స్ ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.










