ప్రజాశక్తి-వడ్డేశ్వరం : రైతాంగ, చేనేత, కౌలు రైతు ఉద్యమ నిర్మాత, సిపిఎం మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు కొరటాల సత్యనారాయణ శత జయంతి సభ వడ్డేశ్వరంలోని కొరటాల బాపనయ్య భవనం (కెబి భవనం) లో నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల నాయకులు, తదితరులు కొరటాల నివాళులు అర్పించారు.

కొరటాల సత్యనారాయణ శత జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సిపిఎం నాయకులు, కార్యకర్తలు నివాళుర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో పాల్గొన్నారని, తరువాత పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశారని తెలిపారు. ఆయనే స్వయంగా అధ్యయనం చేసి, చేనేత కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. నిశితమైన పరిశీలన, సమస్యను పరిష్కరించేందుకు కొనసాగింపు కార్యక్రమాలు, కార్యకర్తలతో కొరటాలకున్న సన్నిహిత్యం వంటి మూడు అంశాలను ఆయన నుండి నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు.











