హైదరాబాద్ : ఖైరతాబాద్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2013లో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయాపరిచారనే అభియోగాలపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు నాగేందర్‌ణు దోషిగా తేల్చింది. ఆయనపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో నాగేందర్‌కు జైలు శిక్ష విధించింది. అయితే, దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు అనుమతించిన న్యాయస్థానం.. శిక్ష అమలును నెల రోజులు వాయిదా వేసింది.










