ఖాద్రీశుడి ఆలయంలో వైసిపి నాయకులతో మంత్రి రోజా
ప్రజాశక్తి కదిరి అర్బన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామ్తంరి ఆర్.కె.రోజా ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని గురువారం దర్శించుకున్నారు. గురువారం గాండ్లపెంట మండలంలోని కటారుపల్లి గ్రామంలో శ్రీ యోగి వేమన జయంతి కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈనేపథ్యంలో ఆమె కదిరి లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రధాన అర్చకులు, ఆలయ ఈవో గురుప్రసాద్, చైర్మన్ గోపాలకృష్ణ, ట్రస్టు సభ్యులు తదితరులు మంత్రి రోజా, ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రికి సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వైసీపీ నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










