ప్రజాశక్తి-కదిరి అర్బన్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఉత్తర గోపరం ద్వారా దర్శన భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా భక్తులు తెల్లవారుజాము నుంచే బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీవారి చల్లని దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నకున్నట్లు తెలిపారు. సిఎం జగన్‌కు దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజలకు మరింత మంచి చేయాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇఒ గురుప్రసాద్, ఛైర్మన్ గోపాలకృష్ణ తెలిపారు. డిఎస్‌పి భవ్యకిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శణానికి బారులుదీరిన భక్తులు










