Jan 23,2023 19:41

విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన మాథ్స్‌, ఫిజిక్స్‌, కెమెస్ట్రీ క్యాట్‌ ఒలంపియాడ్‌ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు సత్తాచాటి ప్రభంజనం సృష్టించారని ఎజిఎం రమణయ్య విజేతలకు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ ఆకేపాటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ 4 నగదు పురస్కారాలు, 10 పతకాలు, 37 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపించడం వలన ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ అనూష, అకడమిక్‌ డీన్‌ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.