Feb 23,2023 19:41

క్యాంపస్‌ ఎంపికలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : స్థానిక శ్రీ జ్ఞానంబికా డిగ్రీ కాలేజ్‌లో చెన్నైకు చెందిన టెక్‌ మహీంద్రా కంపెనీ నిర్వహించిన క్యాంపస్‌ ఎంపికల్లో 95 మంది విద్యార్థులు బిసినెస్‌ ప్రోగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ కొరకు ఎంపికైనట్లు కళాశాల కరెస్పాండంట్‌ గురుప్రసాద్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం రూ.2.5 లక్షలు ఉంటుందన్నారు. చెన్నైలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. క్యాంపస్‌ సెలెక్షన్స్‌ ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్‌ రమాదేవి, ప్లేసెమెంట్‌ ఆఫీసర్‌ మహేష్‌, అధ్యాపకులు అభినందించారు.