క్యాలండర్‌ను ఆవిష్కరిస్తున్నదృశ్యం
క్యాలెండర్ ఆవిష్కరణ
నెల్లూరు:ఏపీ యన్ జీ అసోసియేషన్ భవనంలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా శాఖ 2023 వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపి యన్ జీ ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన్నేపల్లి. పెంచలరావు, నాయుడు. వెంకటస్వామి ముఖ్యఅతిధులుగా పాల్గొని క్యాంలెడర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్‌జిఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 వ తేదీ అవుతున్నా ఇంకా జీతాలు కొన్ని శాఖల ఉద్యోగులకు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు అందరూ కూడా బ్యాంకులలో హౌమ్ లోన్లు అయితేనేమి పర్సనల్ లోన్లు అయితేనేమి అప్పులు చేసుకొని 1 వ తేదీ జీతాలు కోసం ఎదురు చూసే ఉద్యోగులు అనేక మంది ఉన్నారన్నారు. ప్రతినెల ఉద్యోగులకు జీతాలు పడేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ యన్ జీ ఓ రాష్ట్ర అధ్యక్షులు బండి.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి. శివారెడ్డి లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి వినతి పత్రం అందజేసి కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన డీఏలు,సరెండర్ లీవ్ లు,జీ పి యఫ్ లోన్లు వివిధ ఆర్థికపరమైన అంశాలను గూర్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దష్టికి తీసుకెళ్లామన్నారు. అనంతరం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అసోసియేషన్ ను బలోపేతం చేసుకోవాలని,మీ పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే యన్ జీ ఓ అసోసియేషన్ కు తెలిపి సమస్యలు పరిష్కారం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బండారుపల్లి. వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షులు నందిమండలం .ఆంజనేయ వర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి గాదిరాజు. రామకష్ణ,సంయుక్త కార్యదర్శులు లక్కాకుల.పెంచలయ్య, కడెం. రాజేంద్రప్రసాద్, జిల్లా మహిళా చైర్ పర్సన్ ఉదయగిరి.చిన్నమ్మ,కన్వీనర్ అరుణ, నెల్లూరు నగర సంయుక్త కార్యదర్శి షేక్. షంషుద్దీన్ గ్రామ వార్డు సచివాలయం జిల్లా అధ్యక్షులు గంగాధర్,సిబ్బంది పాల్గొన్నారు.










