Jan 11,2023 22:04

క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : సత్యసాయి జిల్లా ప్రయివేటు పాఠశాలల సంఘం (అపుస్మా )2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎంఇఒ గంగప్ప చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. ఎంఇఒ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్‌, జిల్లా కార్యదర్శి రియాజ్‌, జిల్లా గౌరవాధ్యక్షులు ముస్తఫా అలీ ఖాన్‌, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు బాలకృష్ణ, దీపు, ప్రసాద్‌, రాధాకృష్ణ, షౌకత్‌, మూర్తి, రియాజ్‌, ఇస్మాయిల్‌, తదితరులు పాల్గొన్నారు.