Jan 10,2023 18:51

క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న కనకారావు

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు అంబేద్కర్‌ విగ్రహం కూడలిలో ధమ్మచక్ర ఫౌండేషన్‌, ఒంగోలు బుద్ధ విహార ట్రస్టు ఆద్వర్యంలో బుద్ధుని జీవిత ఘట్టాలతో కూడిన క్యాలెండర్‌ను మాదిగ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ కొమ్మూరి కనకారావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనకారావు, అధ్యక్షత వహించిన ఉపాసకులు గాండ్లహరి ప్రసాద్‌ మాట్లాడారు. గేరాచిరంజీవి ,రావులకొల్లు బ్రహ్మానందం, ముప్పవరపు కిషోర్‌, గేరామనోహర్‌, కామాక్షి, వంకాయలపాటి లాజరు ,చనమాలకోటేశ్వరరావు, చంద్రా ,అశోక్‌,సూరపోగు అఖిల్‌,తదితరులు పాల్గొన్నారు.