ప్రజాశక్తి - పాలకొల్లు, పాలకొల్లు రూరల్
టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకూ లబ్ధి చేకూరుతుందని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు తెలిపారు. రూరల్ గ్రామాల్లో, పాలకొల్లులోని ఎనిమిదో వార్డులో చేపట్టిన భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ నిమ్మల పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు చేపట్టనున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనతంరం వారికి బాండ్లు అందజేశారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సారధ్యంలో అధికారంలోకి వచ్చే కూటమి రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ప్రతి ఇంటిలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికీ నెలకు 1500 చొప్పున ఏడాదికి రూ.18,000, తల్లికి వందనంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఏడాదికి రూ.15,000 చొప్పున అందిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారు.