Dec 04,2022 22:03

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకరనారాయణ

హిందూపురం : కురుబలు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్య అతిథులు ఎంపీ గోరంట్ల మాధవ్‌, పెనుకొండ ఎమ్యెల్యే శంకర్‌ నారాయణ, మాజీ ఎమ్యెల్యే పార్థ సారథి, బిసి కమిషన్‌ మెంబర్‌, విశ్రాతం న్యాయమూర్తి కిష్టప్ప పేర్కొన్నారు. కనకదాసు 535వ జయంతి ఉత్పవాల్లో భాగంగా పట్టణంలోని మేళాపురంలో కనకదాసు విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ముదిరెడ్డిపల్లి నంది సర్కిల్‌ నుంచి మేళాపురంలోని కనకదాసు విగ్రహం వరకు మహిళాలు కళాశాలజ్యోతుల ఊరేగింపు నిర్వహించారు. దీంతో పాటు చెక్కభజన, గొరవయ్యల విన్యాసాలతో వెండి రథంపై కనకదాసు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ కురుబలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ కురుబసంఘం కళ్యాణమండప నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.20 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కురుబ సంఘం అధ్యక్షులు రాజహంస శ్రీనివాసులు, జిల్లా యువత అధ్యక్షులు బుల్లె లింగప్రసాద్‌, ఎఐసిసి మెంబర్‌ శ్రీధర్‌, విగ్రహ దాత శాంతమ్మ, డాక్టర్‌ నరేష్‌, విశ్రాంత ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు, కురుబ ఉద్యోగుల సంఘం అద్యక్షులు గోపాల్‌, రెడ్డప్ప, కౌన్సిలర్‌ శివ, లక్ష్మి మహేష్‌గౌడ్‌, ముదిరెడ్డిపల్లి, మేళాపురం సంగం అధ్యక్షులు శంకరప్ప, ఉపాధ్యక్షులు రామలింగప్ప, సెక్రటరీ లక్ష్మీనారాయణ, కోశాధికారి బాలాజీ, సలహాదారుడు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.