ప్రజాశక్తి-వాల్మీకిపురం : తొలితరం సినిమా థియేటర్ యజమాని మొర్రంరెడ్డి కుమార్‌రెడ్డి గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాని, ఆయన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం స్థానిక సీతారాం థియేటర్‌లో కుమార్‌రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, నవాజ్ బాషా, ఎపిఎండిసి డైరెక్టర్ హరీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎంతో మంది నిరుపేదలకు ఉపాధిని కల్పించడంతో పాటు నిరుపేదలను ఆదరించిన వ్యక్తి కుమార్‌రెడ్డి అని కొనియాడారు. అనంతరం రామ్‌కుమార్‌రెడ్డి, శ్యామ్ కుమార్‌రెడ్డిలను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్‌రెడ్డి, నాయకులు చింతల ఆనందరెడ్డి, కేశవరెడ్డి, నీళ్లభాస్కర్, అబ్దుల్ కలీమ్ పాల్గొన్నారు.










