సిబ్బందితో మాట్లాడుతున్న ఎపిఒ మాధవి
తంబళ్లపల్లి : మండలంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచేందుకు టెక్నికల్, ఫీల్డ్‌అసిస్టెంట్లు చొరవ చూపాలని ఎపిఒ మాధవి కోరారు. బుధవారం స్త్రీశక్తి భవన్‌లో ఉపాధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలను చైతన్యపరిచి పనులకు వచ్చేలా కషి చేయాలని సూచించారు. ప్రతి కూలి ఆధార్ నెంబర్‌ను జాబ్‌కార్డుకు అను సంధానం చేయాలని తెలిపారు. కూలీల పనులు ప్రారంభించినప్పుడు ముగిం పు సమయంలో ఫోటోలు తీసి ఆన్లైన్లో సమాచారం అందించాలన్నారు. ప్రతి కూలీ నాలుగు గంటలు పాటు పనిచేసేలా చూడాలని, జరిగిన పనులకు కొలతలు తీసి బిల్లులు చెల్లించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ ఇంజనీర్ రామన్న పాల్గొన్నారు.










