May 23,2023 20:56

కూలి సగమే!

రోజుకు 'ఉపాధి' రూ.120లే
డిమాండ్‌ పీరియడ్‌లో గైర్హాజరైతే గల్లంతే
సదుపాయాల నగదు రూ.87 ఎగనామం
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : జిల్లాలోని ఉపాధి కూలీలకు కునికిపాట్లు తప్పడం లేదు. కేంద్ర ంలోని బిజెపి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్ని చాప కింద నీరులా సాగిస్తూనే ఉంది. ఇందులోభాగంగా ఉపాధి హామీ కూలీలకు వస తుల కల్పన కింద ఇవ్వాల్సిన నగదు చెల్లింపులకు ఎగనామం పెట్టి ంది. ఇందులో టెంట్లు, తాగునీరు, మజ్జిగ, గడ్డపారలు, తట్టా బుట్ట, వేసవి అలవెన్స్‌, మేట్ల తొలగింపు తదితర సదుపాయాలకు ఇవ్వా ల్సిన సుమారు రూ.60పైగా నిలిపేసింది. ఫలితంగా ఉపాధి కూలీ లు ఎండల నుంచి ఉపశమనం లభించకపోవడంతో నిర్దేశిత కొలత పరిమాణంలో పనుల్ని చేయడం లేదనే పేరుతో సగానికిపైగా తెగ్గో స్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలోని కమలాపురం నియోజకర్గం వల్లూరు మండల పరి ధిలోని ఓబాయపల్లి, గోటూరు చెరువుల్లో ఉపాధి కూలీలకు వసతుల కల్పనలో ఉపాధి యంత్రాంగం విఫలమైంది. మండలంలోని 15 పంచాయతీల పరిధిలోని 51 ప్రదేశాల్లో సోమవారం ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఇందులోభాగంగా 2,309 మంది హాజరయ్యా రు. కేంద్రంలోని బిజెపి సర్కారు ఉపాధి పనుల్లో పారదర్శకత పేరు తో తెచ్చిన టిసిఎస్‌ నుంచి ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌ కింద డిమాండ్‌ పొం దిన ఉపాధి కూలీలు వారంలో నాలుగు రోజులు పనులకు హాజరై మిగిలిన మూడు రోజులు వెళ్లకపోతే వారం రోజులపాటు ఉపాధి కల్పించినట్లు జమ చేసుకుంటోంది. ఫలితంగా డిమాండ్‌ పొందిన కూలీలు మూడు రోజుల ఉపాధిని వదులుకోవాల్సిన దుస్థితి దాపు రించింది.
'కూలి'కి పాట్లు
ఉపాధి కూలి సగానికి పరిమితమైంది. ఉపాధి ప్రదేశాల్లో కూలీల సంరక్షణకు ఉద్దేశించిన సదుపాయాల కల్పనను తుంగలో తొక్కింది. ఫలితంగా కూలి రూ.120 మించి పడడం లేదు. దీనికి తోడు ఉపాధి కూలీల వసతుల కల్పనకు ఇవ్వాల్సిన రూ.87 అలవె న్స్‌ను ఉపసంహరించుకుంది. ఫలితంగా వల్లూరు మండలంలోనే ఒక్కరోజుకు సంబంధించి కూలి రూ. 2.77 లక్షలు, అలవెన్స్‌ కింద రూ. రెండు లక్షలు మేర మొత్తం 4.77 లక్షలు నష్టపోతున్నట్లు తేలు తోంది. గతంలో ఉపాధి కూలీలు రూ.30 వేసవి అలవెన్స్‌, మేట్‌ అలవెన్స్‌ రూ.27, తాగునీటికి రూ.ఐదు, గడ్డపారకు రూ.15, తట్టా బుట్టకు రూ.ఐదు, మజ్జిగకు రూ.ఐదు చొప్పున చెల్లించడం తెలి సిందే. టిసిఎస్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి కేంద్రం ఎన్‌ఐసి సాప్ట్‌వేర్‌లోకి మార డంతో కత్తిరింపులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. వేసవి అల వెన్స్‌ను రూ.23 ఇస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఐదు గంటలపాటు పని చేస్తేనే ఇస్తామని మెలిక పెట్టడం విస్మ యాన్ని కలిగిస్తోంది. ఫలితంగా వేసవి అలవెన్స్‌ పొందే అవకాశం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. తాగునీటికి, మజ్జిగకు, గడ్డపారకు, తట్టా బుట్టకు ఐదేసి రూపాయల చొప్పున ఇవ్వాల్సిన అల వెన్స్‌కు తుం గలో తొక్కింది.
కంప చెట్లే టెంట్లుగా...
ఉపాధి ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో కూలీ లకు కంపచెట్లు ఉపశమన కేంద్రాలుగా మారడం ఆందోళన కలిగి స్తోంది. సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి కంపచెట్లు నీడనిస్తుండ డం గమనార్హం. ఇటీవల గోటూరు చెరువులో పని చేసిన జంగిట లక్షుమ్మ అనే మహిళ ఉపాధి పని నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మృతి చెందినట్లు తెలిసింది. 2014లో ఇచ్చిన టెంట్లు, కొరముట్లు మరమ్మతులకు గురవడం, మరమ్మతులకు ఒక్క రూపాయిని విడు దల చేయక పోవడం, వసతులను పర్యవేక్షించే మేట్లను తొల గించ డంతో వడదెబ్బల బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదన విని పిస్తోంది.
పదేళ్లుగా పెరగని కూలి
2014 నుంచి ఉపాధి కూలి పెరుగుదలకు నోచుకోవడం లేదు. 2014లో ఉపాధి కూలి రూ.272 ఉండగా, పదేళ్ల అనంతరం రూ.272 ఉండడం గమనార్హం. వల్లూరు మండలంలో కనిష్టంగా రూ.120 నుంచి గరిష్టంగా రూ.180 వరకు పడుతుండడం విస్మ యాన్ని కలిగిస్తోంది. ఏటా 15 శాతం ధరలు పెరుగుతున్న నేప థ్య ంలో ఉపాధి కూలి రూ.600 పెరగాల్సి ఉంది. వాస్తవంలో సగటు కూలిని పరిశీలిస్తే రూ.180 మించి పడడం లేదని తెలుస్తోంది.
వసతులు కల్పించండి
ఉపాధి పనుల దగ్గర వసతులు కల్పించాలి. దీంతో ఉపాధి కూలిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందులో టెంట్లు, తాగు నీరు, మజ్జిగతోపాటు ప్రాణాధార ఔషదాలను అందుబాటులో ఉం చాలి.
- పెంచలమ్మ, వెంకటేశాపురం, వల్లూరు
ఉపాధి పనులే ఆధారం
ఉపాధి కూలి పనులే ఆధారంగా బతుకుతున్నాం. నిత్యావసరా ల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి కూలిని పెంచాలి. పెరుగుతున్న ధరలతో బతుకడం కష్టంగా మారింది.
- వెంకటరమణ, ఓబాయపల్లి, వల్లూరు.
ఉపాధి హామీని బలోపేతం చేయాలి
ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. కూలీలు మొద లుకుని పదెకరాలు భూములు కలిగిన రైతులు సైతం ఉపాధి కూలి పనులకు వెళ్తున్నారు. ఇటువంటి పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.
- వి.అన్వేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, కడప.
- కాలువలో పూడిక పనులు చేస్తున్న కూలీలు