ప్రజాశక్తి-పరిగి మండలంలోని ఎపి ఆర్‌జెసి పాఠశాలలో ఇటీవలే దళిత విద్యార్థిపై ఓ ఉపాధ్యాయురాలు కులం పేరుతో దూషించిన ఘటనపై సౌజన్య లక్ష్మి, ఎస్‌ఐ నరేంద్ర, ఎంఇఒ లక్ష్మీదేవి గురువారం విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ దళిత విద్యార్థులపై ఉపాధ్యాయురాలు సుజాత చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని, ఇక్కడ సీనియర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శివారెడ్డి అండతోనే చేసినట్లు తేలిందన్నారు. ఒక వంట మనిషి ఫిర్యాదులో సంతకం పెట్టడం ఏంటనే ప్రశ్నించడమే కాకుండా అక్కడ పనిచేస్తున్న కొంతమంది జీతభత్యాలను బిల్లులను సైతం కాకుండా చూస్తానని శివారెడ్డి ఫోన్ సంభాషణలో హెచ్చరించారని ఇతనిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా ఇలాంటి ఘటనలో పురావృతం కాకుండా కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ప్రన్సిపాల్‌కు సూచించారు.
కళాశాలలో విచారణ చేస్తున్న అధికారులు










