జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధుల్లో గుంపులుగా ఉంటున్న కుక్కలను చూసి జనం భయపడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏదోఒక చోట రోజూ ఎవరో ఒకరు కుక్క కాటు బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కుక్కల బెడద నివారించేందుకు అధికార యంత్రాంగం నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది.ప్రజాశక్తి-రాయచోటి
జిల్లాలో కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కుక్కలు ఎవరిని పడితే వారిని చిన్న, పెద్ద ,ముసలి, ముతక అని తేడా లేకుండా దాడి చేసి గాయపరచడంతో ఆసుపత్రికి పరుగులు తీయాల్సిన పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. ముఖ్యంగా వీధులల్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అలాంటి వారిపై కుక్కలు ఒకసారిగా దాడి చేసి ముఖం, కాళ్లు, చేతులు, పొట్ట భాగాలపై కరవడం ఘాట్లు పడేలా రాక్కడం రక్తస్రావ గాయాలు పాలు అవుతున్నారు.దీంతో పిల్లలు ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కుక్కలను వెంటపడి కొట్టే పరిస్థితి వచ్చినప్పటికీ అవి దొరక్కుండా పరుగులు తీస్తూ ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులు హుటా హుట్టిన బిడ్డలను తీసుకొని ఆస్పత్రికి వెళ్లి కుక్క కాటుకు టీకాలు, గాయాలకు మందులు వేయించుకుని తీసుకొచ్చి బిడ్డలను జాగ్రత్తగా మరో మారు కుక్కల దాడి పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే పలు వీధుల్లో కుక్కలు గుంపులుగా వాహనాలపై వెళ్లే వారిపై అరుస్తూ, దాడులు చేస్తూ పరుగులు తీస్తున్నాయి. ఈ తొందరలో వాహన దారులు వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న పలు వాహనాలను ఢకొీనడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. కుక్కలు ఎక్కడపడితే అక్కడ వీధుల్లో భారీ సంఖ్యలో గుంపులుగా చేరి వచ్చిపోయే వారిపై అరుస్తూ కరవడం చేస్తు న్నాయి. ఇటీవల కాలంలో రాజంపేట నియోజ కవర్గం చిన్న పిల్లల పైన అనేకసార్లు దాడులు చేశాయి.
431 మందికి గాయాలు
జిల్లాలో ఏప్రిల్ ఒక్క నెలలోనే 431 మంది కుక్కకాటుకు గురయ్యారు. అందులో 160 మంది పురుషులు కాగా 271 మంది మహిళలు గాయపడిన వారిలో ఉన్నారు. ప్రభుత్వాసుపత్రిలో కుక్క కాటుకు మందులున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజలు ఆందోళనలో దగ్గరలో ఉన్న ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. ఇక చీకటి పడితే పట్టణాలలో సందుల్లో వెళ్లాలంటే పాదచారులు, వాహనదారులు ఎక్కడ కుక్కలు ఉన్నాయో లేదో చూసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీధిలైట్లు లేని ప్రాంతాల్లో కుక్కలు వస్తున్న వారిపై దాడి చేసి గాయాలు పాలు చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో కుక్కలను అదుపు చేయడంలో సంబంధంత అధికారులు శ్రద్ధ చూపకపోవడం పట్ల పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కుక్కలు లేకుండా వాటిని పట్టుకు వెళ్లి ద్వారా ప్రాంతాలకు తరలించి వదిలివేయాలని లేకుంటే ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ పిల్లలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రుల్లో వెళ్లాలంటే భయమేస్తోంది
పట్టణంలో రాత్రి వేలల్లో నడు చుకు ంటూ వెళ్లాలంటే కుక్కలతో భయమేస్తోంది. పట్టణంలో ద్విచక్ర వాహ నంలో గాని, నడు చుకుంటూ గాని ఒంట రిగా వెళ్లాలంటే కుక్కలు వెంటాడుతున్నాయి. మున్సిపల్ అధికా రులు కొన్ని వీధులు మాత్రమే కుక్కలను పడు తున్నారు. పట్టణంలో అన్ని వీధిలో తిరిగి కుక్కలకు టీకాలు వేసి, కుక్కల బెడద లేకుండా చూడాలి.
- కె.వెంకటరమణ, కె.రామాపురం, రాయచోటి.
టీకాలు అందుబాటులో ఉన్నాయి
జిల్లా వ్యాప్తంగా 58 సిహెచ్‌సి సెంటర్లు ఉన్నాయి. రూరల్ 47, అర్బన్ 11 సెం టర్లు ఉన్నాయి. ప్రతి సిహెచ్‌సి సెంటర్లో ఎఆర్‌వి టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కుక్క కాటుకు వలన గాయాలైతే వెంటనే ప్రభుత్వా సుపత్రిలో వెళ్లి వైద్యులు సూచనల మేరకు టీకాలు వేయించుకోవాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- ఎన్.కొండయ్య, డిఎంహెచ్‌ఒ, రాయచోటి.










