కుక్కల దాడిలో మృతి చెందిన జింక
రామసముద్రం: మండలంలోని కాప్పల్లి పంచాయతీ బైరాజుపల్లి గ్రామం సమీపంలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. దాడిలో తీవ్రంగా గాయపడిన జింకను స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రథమ చికిత్స అందించే క్రమంలో మృతి చెందింది. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీదేవి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అర్జున్ కుమార్ ఆధ్వర్యంలో కాప్పల్లి డంపింగ్ యార్డ్ సమీపంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ దినేష్, మంజునాథ్, శానటరీ వర్కర్లు పాల్గొన్నారు.










